Tuesday, November 29, 2011

భారతదేశం - అణు పరీక్షలు

భారతదేశం - అణు పరీక్షలు

1974 మే 18న మొదటిసారిగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారతదేశం అణు పాటవ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ప్లూటోనియంను ఉపయోగించారు. దీని ప్రేలుడు శక్తి 12 కిలోటన్ టి.ఎన్.టి.లకు సమానం. ఈ పరీక్షల వల్ల ఎటువంటి రేడియోధార్మికత వెలువడలేదు. 24 సంవత్సరాల తర్వాత 1998 మేలో రెండవ సారి భారతదేశం అణు పరీక్షలు నిర్వహించింది. దీనితో హభారతదేశం అణుశక్తి సామర్ధ్యం ఉన్నదని ప్రపంచదేశాలకు చాటింది. మే 11 నుండి మే 17 మధ్య జరిగిన ఈ పరీక్షలు 'ఆపరేషన్ శక్తి 98' అనే సంకేతనామంతో పిలిచారు. మే 11న జరిపిన మూడు అణు పరీక్షలలో ఒకటి థెర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు కాగా మిగతావి రెండు అణు పరీక్షలలో ఒకటి మధ్య రకమైన, ఇంకొటి స్వల్ప శక్తిగల అణు పరీక్షలు . మే 13న నిర్వహించిన రెండు అణు పరీక్షలు డిజైన్లో మెరుగైన కంప్యూటర్ సిమ్యూలేషన కోసం అదనపు డేటా సాధనకు వీటిని ఉపయోగించారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates